భారత బ్యాంకింగ్ దిగ్గడం ఎస్పీఐ తన బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే అనేక రకాలైన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, ఇపుడు మరో కొత్త సర్వీసును తీసుకొచ్చింది. ఇకపై ఏటీఎం కార్డు లేకుండానే ఏటీఎం కేంద్రాల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ వెసులుబాటును కేవలం ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల నుంచే కాకుండా ఏ ఇతర బ్యాంకు ఏటీఎం కేంద్రాల నుంచైనా తీసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఇప్పటివరకు ఈ సదపాయం కేవలం పరిమిత ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇపుడు అన్ని ఏటీఎం కేంద్రాల్లో తీసుకుని రానుంది. ఇందుకోసం యోనో యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునే ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్ అనే థీమ్‌ను తీసుకొచ్చింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయని ఎస్బీఐ తెలిపింది.