రూ.160 పలుకుతున్న టమోటా ధరలు.. ధర ఎప్పుడు దిగొస్తుంది?

సోమవారం, 3 జులై 2023 (18:02 IST)
టమాటా ధరలు ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. దీంతో టమాట తినడం ఎలా? ఇంత ధర పెట్టుకుని తినాల్సిన అవసరం ఉందా? తినకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. 
 
మామూలుగా అయితే రూ. రూ.30 నుంచి రూ.40 వరకు ఉండే టమాట ధర ఇంత భారీగా పెరగడం వల్ల తినాలనే ఆశలను వదిలేసుకుంటున్నారు.
 
ధర దిగొస్తుందని అంటున్నా అది మాత్రం దిగి రావడం లేదు. మధ్యప్రదేశ్‌లో టమాట ధర రూ.160 పలకడంతో ప్రజల బాధలు వర్ణించలేనివి. 
 
టమాట ధరలు పెరగడంతో ఇతర కూరగాయల ధరలు కూడా అమాంతం పెరిగాయి. ఏది కొనాలన్నా చేయి రావడం లేదు. కిలో టమాటలకు అరకిలో చికెన్ వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు