ఎస్‌బిఐ విడుదల చేసిన ప్రకటన మేరకు... ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీ బహుమతి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. అయితే, ఈ ఆఫర్ రూ.999 వరకు బహుమతులపై మాత్రమే వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, వినియోగదారులు ఎస్బీఐ యోనో యాప్‌ని ఉపయోగించాలి.
ఇకపోతే, బహుమతి కొనుగోళ్లపై 20 శాతం వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందడానికి కస్టమర్లు యోనో యాప్ ద్వారానే చెల్లింపులు జరపాలి. ఈ ఆఫర్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే.. ఎస్బీఐ యోనో, ఎస్బీఐయోనో డాట్ ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అయితే, గరిష్ట పరిమితి రూ.999 గా నిర్ణయించబడింది. రూ.999 వరకు మాత్రమే కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం ఎస్బీఐ ఒక కోడ్ జారీ చేసింది. ఈ కోడ్ నంబర్ ఎస్‌బిI20 ఇది షాపింగ్ చేసేటప్పుడు అప్లై చేయాల్సివుంటుంది.