బ్లాక్ మండే... మార్కెట్లు భారీ పతనం : రూ.6.86 లక్షల కోట్ల ఆవిరి

సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:55 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో కేవలం 15 నిమిష్లాలో దాదాపు 6.86 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది.
 
కరోనా ఉద్ధృతి మరింత పెరిగితే బ్యాంకింగ్ రంగానికి గడ్డు కాలమే అని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ రంగ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 
 
మిగిలిన బ్యాంకులు కూడా అదే బాట పడుతున్నాయి. మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 1741 పాయింట్లు, నిఫ్టీ 527 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు