"స్విగ్గీ" ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

గురువారం, 25 మార్చి 2021 (18:14 IST)
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ "స్విగ్గీ" ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ఉద్యోగులకు, డెలివరీ పార్ట్‌నర్లకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేసేందుకు స్విగ్గీ సిద్ధమైంది. కరోనా నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియను తీసుకొచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ క్రమంలోనే తమ సిబ్బంది మొత్తానికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు స్విగ్గీ రెడీ అయ్యింది. 
 
ఈ మేరకు స్విగ్జీ సీఈఓ వివేక్ సుందర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అలాగే ఆ టీకా వేయించుకునే రోజును వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామన్నారు. స్విగ్గీ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 2 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లకు ప్రయోజనం చేకూరనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు