కస్టమర్ల సౌకర్యం కోసం.. ఇంటి భోజనం లాంటి ఆహారాన్ని డోర్ డెలివరీ చేసేందుకు స్విగ్గీ కొత్త యాప్‌న ప్రవేశపెట్టింది. హోటల్ భోజనం కంటే ఇంటి భోజనాన్ని అధికంగా ఇష్టపడేవారు.. ''స్విగ్గీ డైలీ'' అనే యాప్ ద్వారా పొందవచ్చునని సదరు సంస్థ వెల్లడించింది. ''స్విగ్గీ డైలీ'' అనే ఈ యాప్ హర్యానాలోని గుర్గావ్ నగరంలో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది.
మలి విడతగా పలు నగరాల్లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు స్విగ్గీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో బెంగళూరు, ముంబై అనే నగరాల ప్రజలకు కూడా ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే ఈ యాప్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తే.. చిరు వ్యాపారులు, గృహిణీలకు ఉపాధి కల్పించినట్లవుతుందని తెలుస్తోంది.