రైడింగ్ సేవలు అందించే ఉబెర్... ఉబెర్ ఈట్స్ పేరిట ఫుడ్ డెలివరీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తోంది. ఇప్పుడు ఉబెర్ ఈట్స్ ఇండియాను స్విగ్గీ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే స్విగ్గీ అతిపెద్ద ఫుడ్-టెక్ కంపెనీగా ఎదగడం ఖాయమనే చెప్పవచ్చు. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య చర్చలు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయిన పక్షంలో స్విగ్గీలో ఉబెర్‌కు 10 శాతం వాటా లభిస్తుంది. ఆ వాటా విలువ 3.3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.
జొమాటో, స్విగ్గీల మధ్య ఫుడ్ టెక్ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉండడంతో మరో పోటీ కంపెనీ అయిన ఉబెర్ ఈట్స్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచేందుకు స్వీగ్గీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు ఉబెర్ నష్టాలను తగ్గించుకునే వ్యూహంలో ఉబెర్ ఈట్స్ ఇండియాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది.