గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్లు: చేతులు కలిపిన సిన్జెంటా- ఐఓ టెక్‌

శనివారం, 11 ఫిబ్రవరి 2023 (16:53 IST)
వ్యవసాయ రంగంలో పెద్ద సంఖ్యలో డ్రోన్లను వినియోగించాలనే ప్రధాన మంత్రి లక్ష్యానికి అనుగుణంగా, సిన్జెంటా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐపీఎల్‌) ఇప్పుడు ఐఓ టెక్‌ వరల్డ్‌ ఏవిగేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని భారతదేశ వ్యాప్తంగా డ్రోన్‌ స్ర్పేయింగ్‌ను పరిచయం చేయబోతుంది. ఈ ఒప్పందంలో భాగంగా, రెండు కంపెనీలూ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడంపై కలిసి పనిచేయడంతో పాటుగా డ్రోన్‌ సాంకేతికత కోసం వారిని సిద్ధం చేయనున్నాయి.
 
ఈ రెండు కంపెనీలూ భారతదేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో ఐఓ టెక్‌ వరల్డ్‌యొక్క డ్రోన్‌ సాంకేతికత వినియోగించి సిన్జెంటా అనుమతించిన రసాయనాలను స్ర్పే చేయడం గురించి కలిసి పనిచేయనున్నాయి. ‘‘మొదటి దశలో 200 మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించడంతో పాటుగా స్ర్పేయింగ్‌ కోసం విధులలో నియమించనున్నాము. భారీస్ధాయిలో 400 ఎకరాలపై ట్రయల్స్‌ చేసిన తరువాత 20 పంటలకు సంబంధించి డాటాను రెగ్యులేటర్లకు సమర్పించడం జరిగింది’’ అని సిన్జెంటా ఎండీ-కంట్రీ హెడ్‌ సుశీల్‌ కుమార్‌ అన్నారు.
 
సిన్జెంటా యొక్క స్ర్పే సేవలు, ఉత్పత్తుల వ్యాప్తంగా ఐఓ టెక్‌ యొక్క డ్రోన్‌ అగ్రిబాట్‌ను వినియోగించనున్నారు. భారత ప్రభుత్వ సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ బోర్డ్‌ నుంచి అనుమతులు పొందిన మొదటి ప్రైవేట్‌ కంపెనీ సిన్జెంటా. ‘‘ఈ అనుమతులు అందించిన ప్రోత్సాహంతోనే సిన్జెంటా ఇప్పుడు వినూత్నమైన డ్రోన్‌ యాత్ర చేస్తుంది.  దీనిలో భాగంగా 13 రాష్ట్రాల్లో 17వేల కిలోమీటర్లు మేర వ్యాన్‌లో తిరుగుతూ డ్రోన్‌ స్ర్పేయింగ్‌ పట్ల  అవగాహన కల్పించనున్నామ’’ని సిన్జెంటా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫార్మర్‌ సెంట్రిక్‌ ఎకోసిస్టమ్‌ హెడ్‌ సచిన్‌ కమ్రా అన్నారు
 
‘‘భారతదేశంలో స్ర్పేయింగ్‌ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని ఐఓటెక్‌ వరల్డ్‌ ఏవిగేషన్‌ డైరెక్టర్‌ దీపక్‌ భరద్వాజ్‌ అన్నారు. సిన్జెంటా  ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐఓటెక్‌ల ఉమ్మడి ప్రయత్నాలలో భాగంగా అర్హులైన అగ్రి  ఎంటర్‌ప్రిన్యూర్స్‌ (ఏఈలు)ను గుర్తించి  డ్రోన్‌ పైలెట్‌ శిక్షణను సిన్జెంటా ఫౌండేషన్‌ ఇండియా అందిస్తుందని  సంస్థ కంట్రీ డైరెక్టర్‌ రాజేంద్ర జోగ్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు