హైదరాబాద్‌లో ది స్లీప్ కంపెనీ నూతన అవుట్‌లెట్‌ ప్రారంభం

ఐవీఆర్

మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (22:45 IST)
భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, భారతదేశంలో తమ 75వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో వైభవంగా  ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ నగరంలో కంపెనీ యొక్క 8వ అవుట్‌లెట్‌గా నిలిచింది, మంచి నాణ్యమైన నిద్ర పరిష్కారాల కోసం నగరవాసుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను ఇవి తీర్చనున్నాయి. ఒకసారి ఈ అవుట్‌లెట్‌లోకి వినియోగదారులు అడుగుపెడితే, విస్తృతమైన రీతిలో ఉత్పత్తి శ్రేణిని వారు అన్వేషించవచ్చు. వీటిలో పేటెంట్ పొందిన స్మార్ట్ గ్రిడ్ పరుపులు, స్మార్ట్ రిక్లైనర్ బెడ్‌లు, దిండ్లు, ఆఫీసు కుర్చీలు అండ్ రిక్లైనర్ సోఫాలు సహా ఎన్నో వున్నాయి. మరో రెండు అదనపు అవుట్‌లెట్‌లతో, నగరంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు కంపెనీ సిద్ధమైంది.
 
భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిద్ర లేమి ప్రధాన సమస్యగా ఉంది, అనేక మంది తమ రద్దీ జీవనశైలి, సోషల్ మీడియా ఎడిక్షన్ మొదలైన వాటి కారణంగా నిద్రలేమికి గురవుతున్నారు. 2023లో ప్రచురించబడిన లాన్సెట్ అధ్యయనం, తెలంగాణలో చాలా ఎక్కువ(25% కంటే ఎక్కువ)గా సెంట్రల్ ఒబేసిటీ, రక్తపోటు కేసులు ఉన్నాయని వెల్లడించింది. నిద్ర లేకపోవడం, ఊబకాయం, రక్తపోటు పెరుగుదల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయి. ది స్లీప్ కంపెనీ వినియోగదారులందరికీ సైన్స్ ఆధారిత, వినూత్నమైన, అసాధారణమైన నాణ్యమైన నిద్ర మరియు సౌకర్యవంతమైన పరిష్కారాలను అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.
 
ది స్లీప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ మాట్లాడుతూ, "మా 75వ స్టోర్ ప్రారంభోత్సవం మాకు ఒక ప్రతిష్టాత్మకమైన సందర్భం. ఇది మా నిరంతర ఆవిష్కరణల ప్రయాణాన్ని ప్రతిబింబించడమే కాకుండా భారతదేశం నిద్రిస్తున్న విధానాన్ని పునర్నిర్వచించాలనే మా నిబద్ధతను సైతం ప్రతిబింబిస్తుంది. 2024 చివరి నాటికి దేశవ్యాప్తంగా 150+ స్టోర్‌లను ప్రారంభించాలని మేము ప్రణాళిక చేసాము, మా పరివర్తన నిద్ర పరిష్కారాలను దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు మరింత చేరువ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు