వాషింగ్‌ మెషీన్ల కోసం పూర్తి సరికొత్త టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ డిటెర్జంట్‌ను విడుదల చేసిన టైడ్‌

బుధవారం, 30 నవంబరు 2022 (15:21 IST)
ప్రపంచంలో నెంబర్‌ 1 డిటర్జెంట్‌ టైడ్‌, ఇటీవలనే తమ పూర్తి సరికొత్త టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ను విడుదల చేసింది. మరీ ముఖ్యంగా టాప్‌ లోడ్‌ మరియు ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్ల కోసం దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ యొక్క సుపీరియర్‌ లిఫ్ట్‌ అండ్‌ లాక్‌ టెక్నాలజీ  అత్యంత కఠినమైన మరకలను తొలగిస్తుంది. అదే సమయంలో వస్త్రాల రంగు తొలగించదు. బహుళ ఉతుకుల తరువాత ఆ వస్త్రాల రంగు ఆకర్షణీయంగా ఉంచేలా చేస్తూనే మరింత మెరుగైన ఉతుకు అందిస్తుంది. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ జోడింపుతో  టైడ్‌ యొక్క పోర్ట్‌ఫోలియో ఉత్పత్తులలో విస్తృత శ్రేణి డిటర్జెంట్లు చేరాయి. వీటిలో పౌడర్లు, పాడ్స్‌ కూడా భాగంగా ఉన్నాయి. ప్రతి ఒక్కదానినీ విభిన్నమైన వినియోగదారుల గృహావసరాలను తీర్చే రీతిలో రూపొందించారు.
 
ఎక్కువ మందిలో కనిపించే అతిపెద్ద ఆందోళన ఏమిటంటే తరచుగా వస్త్రాలు ఉతికితే వాటి రంగు పోవడంతో పాటుగా తెల్లటి వస్త్రాల రంగు కూడా మారుతుందని. అంతేకాదు, తరచుగా తమ వస్త్రాలపై పడిన కఠినమైన మరకలు పోగొట్టుకునేందుకు గృహ చిట్కాలు వినియోగించడం లేదా మరక ఉన్న చోట పదే పదే ఉతకడం వల్ల ఆ వస్త్రాలు త్వరగా పాడవడం జరుగుతుంది. రోజువారీ వాడే వస్త్రాలు లేదా ఖరీదైన వస్త్రాలైనా సరే టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ ఈ సమస్యలన్నింటికీ తగిన పరిష్కారాలను  చూపుతుంది. అంతేకాదు, రంగుల పట్ల  మృదువుగానూ వ్యవహరిస్తుంది.
 
అంతేకాదు, తరచుగా ఉపశమనం కోసం వెదుకుతూ తమ ఖరీదైన వస్త్రాలపై పడిన కఠినమైన మరకలు పొగొట్టుకోవాలనుకునే వారికి వారి వస్త్రాల రంగు పోగొట్టకుండానే తగిన పరిష్కారాలనూ అందిస్తుంది. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌  పలుమార్లు ఉతికిన తరువాత కూడా వస్త్రాల రంగులను కాపాడటంతో పాటుగా మరకలనూ తొలగిస్తుంది.
 
పీ అండ్‌ జీ ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మరియు వైస్‌ ప్రెసిడెంట్‌- ఫ్యాబ్రిక్‌ కేర్‌ శరత్‌ వర్మ మాట్లాడుతూ, ‘‘అసాధారణ క్లీనింగ్‌ మరియు ఆహ్లాదకరమైన లాండ్రీ అనుభవాలను విభిన్నమైన వాష్‌ కండీషన్స్‌, గార్మెంట్స్‌ వ్యాప్తంగా అందించాలని టైడ్‌ కోరుకుంటుంది. అది అత్యధిక మెరుపు కలిగిన శ్వేత వస్త్రాలు, మరకల తొలగింపు లేదా శుభ్రమైన మరియు ప్రకాశవంతమైన రంగులు ఏదైనా మెరుగైన అనుభవాలను టైడ్‌ అందించాలనుకుంటుంది. ప్రపంచంలో నెంబర్‌ 1 డిటర్జెంట్‌ బ్రాండ్‌ టైడ్‌. ఇప్పుడు నూతన టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ను రంగులు పోకుండానే కఠినమైన మరకలను పోగొట్టే రీతిలో తీర్చిదిద్దాము. మెషీన్‌ లోపల అసాధారణ స్టెయిన్‌ రిమూవల్‌గా తీర్చిదిద్దిన ఈ మ్యాటిక్‌ లిక్విడ్‌ సుదీర్ఘకాలం తాజా దనాన్ని వస్త్రాలకు అందిస్తుంది.  తమ మెషీన్‌లో అత్యద్భుతమైన  పరిశుభ్రత కావాలనుకునే వారు ఖచ్చితంగా ప్రయత్నించాల్సిన డిటర్జెంట్‌ లిక్విడ్‌ ఇది’’ అని అన్నారు.
 
ఏ ఒక్కరూ కూడా రంగులు వెలిసి, కాంతి విహీనంగా ఉన్న వస్త్రాలను ధరించాలని కోరుకోరు. మరీ ముఖ్యంగా ఖరీదైన వస్త్రాలు. వస్త్రాల నుంచి  అతి కఠినమైన మరకలను తొలగించడం ప్రజలకు ఆందోళనగా పరిణమిస్తుంటుంది. మరల మరల వస్త్రాలు ఉతకడం లేదా గృహ చిట్కాలను  పదే పదే వాడడం వల్ల  మరకలు తొలగిపోవచ్చేమో కానీ వస్త్రాలు కూడా కాంతి విహీనంగా తయారవుతాయి. టైడ్‌ మ్యాటిక్‌ లిక్విడ్‌ ఈ కఠినమైన మరకలతో పోరాడుతుంది. మెషీన్‌ లోపలే ఇది ఆ మరకలతో  పోరాడి రంగులు కాంతి విహీనంకాకుండా కాపాడతాయి. అదే సమయంతో వస్త్రాలకు తాజా, స్వచ్ఛమైన అనుభవాలు అందిస్తాయి.
 
తాము చేసే ప్రతి కార్యక్రమాన్ని వినియోగదారులే లక్ష్యంగా చేసే టైడ్‌, తమ ఆవిష్కరణ మరియు అభివృద్ధిని కొనసాగిస్తుంది. లాండ్రీ కేర్‌ సంరక్షణలో  హద్దులను అధిగమించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా టైడ్‌ ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు, టైడ్‌ ఇప్పుడు స్పేస్‌ యాక్ట్‌ అగ్రిమెంట్‌ను నాసాతో చేసుకుంది. తద్వారా అంతరిక్షంలో వినియోగించేందుకు లాండ్రీ పరిష్కారాలు, సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు