13 మంది ప్రగతిశీల పొగాకు రైతులను, ముగ్గురు వ్యవసాయ శాస్త్రవేత్తలను సత్కరించిన టిఐఐ

ఐవీఆర్

సోమవారం, 15 జులై 2024 (23:26 IST)
సమకాలీన వ్యవసాయ పద్ధతుల ప్రయోజనాలను ప్రదర్శించడం ద్వారా మెరుగైన ఉత్పాదకత సాధించిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రగతిశీల రైతులను సత్కరించేందుకు పొగాకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(టిఐఐ) ఈరోజు పొగాకు రైతుల అవార్డుల 24వ ఎడిషన్‌ను నిర్వహించింది. దానితో పాటు, పొగాకు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన, నిబద్ధతను గుర్తించేందుకు ఇన్స్టిట్యూట్ టిఐఐ పొగాకు శాస్త్రవేత్త అవార్డుల ప్రారంభ ఎడిషన్‌ను సైతం నిర్వహించింది. పొగాకు పంటల పరిశోధన, పంటల అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ఇకపై ప్రతి ఏటా అందజేస్తారు.
 
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి. డి. పురందేశ్వరి, శ్రీ పుట్ట మహేష్ కుమార్; గౌరవనీయులైన శాసన సభ సభ్యులు శ్రీ మద్దిపాటి వెంకట రాజు; చైర్మన్, పొగాకు బోర్డు, శ్రీ యశ్వంత్ కుమార్; వైస్ చైర్మన్, పొగాకు బోర్డు, శ్రీ జి. వాసుబాబు; డైరెక్టర్ సిటిఆర్ఐ, డాక్టర్ ఎం. శేషు మాధవ్; పొగాకు బోర్డు కార్యదర్శి శ్రీ డి.వేణుగోపాల్, బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్ముల దత్తు పాల్గొన్నారు. 
 
ఈ వేడుకలో 13 మంది పొగాకు రైతులకు నాలుగు వేర్వేరు విభాగాల్లో- జీవితకాల సాఫల్య పురస్కారాలు (2), ఉత్తమ రైతు అవార్డులు (5) సస్టైనబిలిటీ అవార్డులు(2), గుర్తింపు అవార్డులు(4)గా సన్మానాలు జరిగాయి. టిఐఐ సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రయోజనాలను ప్రదర్శించడానికి 2023లో కర్ణాటక ఎడిషన్ అవార్డులలో సస్టైనబిలిటీ అవార్డులను ప్రవేశపెట్టింది. ఇంకా, ముగ్గురు  వ్యవసాయ శాస్త్రవేత్తలు మొదటి టిఐఐ పొగాకు శాస్త్రవేత్త అవార్డులతో సత్కరించబడ్డారు.
 
అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో టిఐఐ డైరెక్టర్ శ్రీ శరద్ తండన్ మాట్లాడుతూ, “ఆధునిక మరియు ప్రగతిశీల వ్యవసాయాన్ని అవలంబించడంలో సిగరెట్ లీఫ్ పొగాకు వ్యవసాయ సమాజాన్ని గౌరవించే మరియు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 1999లో పొగాకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. దిగుబడిని మెరుగుపరచడానికి, మెరుగైన రకాలను ఉత్పత్తి చేయడానికి మరియు ప్రపంచ మార్కెట్‌లో భారతీయ పొగాకులకు పోటీపడేలా చేయడానికి సహాయపడే పద్ధతులు అనుసరించే వారికి ఈ అవార్డులు అందించారు " అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు