ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలైన వాటిపై బంగారం ధరలు ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం బంగారం ధర మళ్లీ తగ్గింది.
బంగారం రేట్లు తగ్గినా.. వెండి మాత్రం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 క్షీణించింది. దీంతో పసిడి రేటు రూ.49,470కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.150 తగ్గుదలతో రూ.45,350కు క్షీణించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 2.31 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1818 డాలర్లకు క్షీణించింది. ఇక వెండి రేటు ఎలా వుంది అనేది చూస్తే.. వెండి రేటు రూ.300 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,200కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 2.32 శాతం తగ్గుదలతో 27.17 డాలర్లకు పడిపోయింది.