నిత్యావసర వస్తు ధరలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ఇది చాలదన్నట్లు ఉల్లి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఎర్ర ఉల్లిగడ్డ రూ.30-35, తెల్ల ఉల్లిగడ్డ రూ.40-60దాకా విక్రయిస్తున్నారు.
అయితే మరో నెల, రెండు నెలల తర్వాత ఈ ధరలు భారీగా పెరగవచ్చని, రూ.100కుపైగా చేరుకోవచ్చని నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీస్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సంజయ్ గుప్తా తెలిపారు.
ప్రస్తుతం నిల్వ చేసిన 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ నుంచి ఉల్లిపాయల్ని వాడుతున్నామని గుప్తా చెప్పారు. అయితే తగ్గిన పంట దిగుబడుల ప్రభావం అక్టోబర్, నవంబర్ నెలల్లో కనిపిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిల్వలు తగ్గితే.. ఒకట్రెండు నెలల్లో కిలో ఉల్లిపాయ రూ.100 దాటవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.