చైనాపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోత - పుత్తడిపైకి మళ్లిన పెట్టుబడులు!

ఠాగూర్

శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (11:20 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలకు విధించిన ప్రతీకార సుంకాల దెబ్బకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి. దీంతో బంగారం ధరలతో పాటు రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ట్రంప్ దెబ్బకు ఇతర రంగాలపై పెట్టుబడులు పెట్టేవారు.. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
కొన్ని రోజులుగా తగ్గుముఖంపట్టిన బంగారం ధరలు గురువారం మరోమారు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145 శాతానికి పెంచడం మదుపర్లలో ఆందోళన పెంచింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడిపైకి మళ్లించడంతో ధరలు ఆమాంతం పెరిగాయి. 
 
ఇక గురువారం దేశీయంగా 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.3 వేల వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.2,940 పెరిగి రూ.93,380 చెరుతుంది. ముంబైలో రూ.2,940 పెరిగి 93,380 ఎగబాకింది. 
 
ఇక, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.93,380 చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా గురువారం భారీగా పెరిగింది. పాశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ముంబైలో కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగి రూ.95 వేలకు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో రూ.5 వేలు పెరిగి రూ.1.07 లక్షలకు చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు