మార్కెట్లకు బ్లాక్ మండే : సెన్సెక్స్ 3 వేల పాయింట్లు డౌన్

ఠాగూర్

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (10:11 IST)
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 3,233 పాయింట్ల నష్టంతో 72,130 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిప్టీ సైతం 1,022 పాయింట్లు కోల్పోయి 21,882 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం భయాదోళనలు పెరిగి మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఈ వారం కూడా ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగానే పడింది. దీంతో ఫ్రీట్రేడింగ్‌లో సెన్సెక్స్ 4 వేల పాయింట్లను వరకు కోల్పోయింది. 
 
ఇప్పటికే ఆసియా మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. 2008 తర్వాత ఆసియా మార్కెట్లు ఈ స్థాయిలో నష్టాలను చవిచూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జపాన్ నిక్కీ ఒక దశలో 8.8 శాతం మేరకు పతనమైంది. ప్రస్తుతం 6 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతుంది. తైవాన్‌ సూచీ 9.61 శాతం, సౌత్ కొరియా కోప్పి 4.14 శాతం, చైనా షాంఘై సూచీ 6.5 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ సూచీ 3.82 శాతం మేరకు నష్టాలను చవిచూశాయి. అటు అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ కూడా నష్టాల ఊబిలోనే కొనసాగుతున్నాయి. డోజోన్స్ 2.2 శాతం మేరకు పడిపోయింది. దీంతో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అగ్రరాజ్య మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు