బెంగళూరు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్(ఉజ్జీవన్ SFB) ఉజ్జీవన్ రివార్డ్స్‌ను ఈ రోజు ప్రకటించింది, తమ వివిధ డిజిటల్ లావాదేవీలపై కస్టమర్లకు బహుమానాలు అందచేయడానికి రూపొందించబడిన బహుళ-అంచెల వ్యవస్థ ఇది. ఈ కార్యక్రమంతో, ఉజ్జీవన్ SFB ఆకర్షణీయమైన మరియు వ్యక్తిగత ప్రయోజనాలను అందచేయడం ద్వారా కస్టమర్ల ప్రమేయం, అనుభవాన్ని మరింత విస్తృతం చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఉజ్జీవన్ SFB AdvantageClub.aiతో భాగస్వామం చెందింది, ఉజ్జీవన్ SFB కస్టమర్లకు విధేయతతో కూడిన పరిష్కారాలను అందించడానికి తమ వినూత్నమైన విధానానికి ప్రసిద్ధి చెందిన సంస్థ.
ఈ ఉజ్జీవన్ రివార్డ్స్ కార్యక్రమం అకౌంట్ ప్రారంభించడం, రికరింగ్ డిపాజిట్లు, బిల్లు చెల్లింపులు, డిజిటల్ ప్లాట్ ఫాంలలో రిజిస్ట్రేషన్స్, POS వంటి డిజిటల్ లావాదేవీలు, ఇ-కామర్స్, UPI, NEFT, IMPS, RTGS వంటి విస్తృత శ్రేణి కార్యకలాపాల పై వారు పాయింట్లు సంపాదించడానికి వీలు కల్పించడం ద్వారా ఒక సంతృప్తికరమైన అనుభవాన్ని అందిస్తోంది. జీవనశైలి, షాపింగ్, ప్రయాణం, వినోదపు శ్రేణుల్లో ఉత్తేజభరితమైన వోచర్ల కోసం ఈ పాయింట్లను కస్టమర్లు రెడీమ్ చేసుకోవచ్చు. సంపాదించిన పాయింట్లు రెండేళ్ల కోసం చెల్లుబాటవుతాయి, అర్థవంతమైన రివార్డ్స్ కోసం వాటిని సేకరించి, రెడీమ్ చేయడానికి కస్టమర్లకు కావలసినంత సమయానికి అవకాశం ఇస్తుంది. రివార్డ్ కోసం అర్హత సంపాదించడానికి తక్కువ కనీస ఖర్చు పరిమితి వంటి ఫీచర్లను చేర్చడం ద్వారా, UPI లావాదేవీల పై రివార్డ్ పాయింట్లు అందించడం ద్వారా, బ్యాంకింగ్ అవసరాలకు మరియు కస్టమర్ల ప్రవర్తనకు తగిన విధంగా ఉజ్జీవన్ రివార్డ్స్ రూపొందించబడింది.
ప్రారంభించడం గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీ హితేంద్ర ఝా, హెడ్ రిటైల్ లయబిలిటీస్, TASC-TPP ఇలా అన్నారు: “మా కస్టమర్లకు ఉన్నతమైన విలువ మరియు అనుభవాన్ని అందించడానికి ఉజ్జీవన్ రివార్డ్జ్ మా ప్రయాణంలో ఒక గణనీయమైన ముందడుగు. కస్టమర్, మా బ్రాండ్ మధ్య వారి మద్దతును గుర్తించడం, ప్రశంశించడం ద్వారా ఒక శక్తివంతమైన ఉద్వేగభరితమైన కనక్షన్‌ను రూపొందించడంలో కార్యక్రమం సహాయపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా, మా కస్టమర్ ప్రాధాన్యతల నుండి విలువైన అభిప్రాయాలను సేకరించడం ద్వారా బ్యాంక్ లో డిజిటల్ మరియు ఆర్థిక చేరికను ప్రోత్సహించడంలో మా ప్రయత్నాలను మేము మరింత వేగవంతం చేసే లక్ష్యాన్న కలిగి ఉన్నాము.”
ఉజ్జీవన్ రివార్డ్జ్ పరిశ్రమలో నిజాయితీ, కస్టమర్-ప్రధమం కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యక్రమం దృడమైన CASA ఆధారాన్ని రూపొందించడంపై, ప్రభావవంతమైన, వ్యక్తిగత ప్రమేయం ద్వారా దీర్ఘకాలం కస్టమర్ విధేయతను పోషించడం పై ఉజ్జీవన్ వారి SFB యొక్క వ్యూహాత్మకమైన కేంద్రీకరణను పునః శక్తివంతం చేస్తోంది.