మొదటి రోజే 14000+ అత్యవసర క్రెడిట్ లైన్ మంజూరు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

మంగళవారం, 2 జూన్ 2020 (21:59 IST)
నోవెల్ కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తి మన దేశంలోని వ్యాపార సంస్థలను, ఆర్థిక వ్యవస్థను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసింది. కోవిడ్ సంక్షోభ సమయంలో బిజినెస్/ఎంఎస్‌ఎంఇ యూనిట్లకు సహకరించడానికి భారత ప్రభుత్వం తన ఆత్మనిర్భర్ అభియాన్ అనేక చర్యలు తీసుకుంటోంది.
 
అటువంటి కార్యక్రమాలలో ఒకటి ఈ అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం, ఇసిఎల్‌జిఎస్ (హామీ ఇవ్వబడిన అత్యవసర ఋణం: జిఇసిఎల్ అనే క్రెడిట్ ఉత్పత్తితో) అదనపు వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ కోసం 100% హామీ కవరేజీని అందించడానికి వారి మొత్తం క్రెడిట్‌లో 20% వరకు అంటే రూ. 25 కోట్ల వరకు, అంటే, 29.02.2020 నాటికి 5 కోట్ల వరకు, 100% హామీ కవరేజీని అందింస్తుంది. అయితే ఆ తేదీ నాటికి ఖాతా 60 రోజుల కన్నా తక్కువ లేదా సమానంగా ఉండాలి.
 
ప్రభుత్వ కార్యక్రమాలకు అనుగుణంగా, ముద్ర లబ్ధిదారులు/ఎంఎస్‌ఎంఇ/బిజినెస్ యూనిట్లు అర్హతకు లోబడి వారి ద్రవ్య సంక్షోభం నుండి బయటపడటానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ గ్యారెంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ (యుజిఇసిఎల్)ను ప్రారంభించింది. ఈ పథకం సమాజంలోని దిగువ వర్గాలకు సేవలందించడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా వారి ఇబ్బందులను తగ్గిస్తుంది.
 
మొదటి రోజున అంటే 2020 జూన్ 1న 14000 కంటే ఎక్కువ ఖాతాలు మంజూరు చేయబడినట్లు ప్రకటిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. బ్యాంక్ దృష్టి ప్రధానంగా యుజిఇసిఎల్ కోసం టైర్- II/ టైర్-III నగరాలపై ఉన్నప్పటికీ, భారతదేశమంతటా ఉన్న శాఖలన్నీ కూడా అర్హతగల కస్టమర్లను సంప్రదించడంలో చురుకుగా పాల్గొంటాయి. పరిమితులను వెంటనే మంజూరు చేస్తాయి. ఈ డిమాండ్ సమయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని అర్హతగల ఎంఎస్‌ఎంఇ/బిజినెస్ యూనిట్లకు తోడ్పాటును అందిస్తుంది, అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు