జీడీపీ అంటే ఏమిటి? దేశ ఆర్థికాభివృద్ధికి కొలమానం

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (20:13 IST)
GDP
స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అనేది ఒక దేశంలో సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు, సేవల మొత్తం విలువ. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి అతి పెద్ద కొలమానం. జీడీపీ ఎక్కువగా ఉంది అంటే దేశ ఆర్థిక వృద్ధి పురోగమిస్తోంది అని అర్ధం. 
 
దీనివలన ఎక్కువ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఏ రంగం ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో.. ఏ రంగం ఆర్థికంగా వెనుకబడి ఉందో కూడా ఇది చూపుతుంది.
 
అలాగే స్థూల విలువ జోడింపు (జీవీఏ). సరళంగా చెప్పాలంటే, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఉత్పత్తి, ఆదాయాల గురించి ఒక ఆలోచనను ఇస్తుంది. 
 
ఇన్‌పుట్ ఖర్చు, ముడి పదార్థాల ధరను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇచ్చిన వ్యవధిలో ఎన్ని రూపాయల వస్తువులు, సేవలు ఉత్పత్తి జరిగిందో ఇది తెలియజేస్తుంది. ఏ రంగంలో, పరిశ్రమలో ఎంత ఉత్పత్తి జరిగిందో కూడా ఇది చూపుతుంది.
 
జాతీయ అకౌంటింగ్ కోణం నుండి చూస్తే కనుక, స్థూల స్థాయిలో జీడీపీలో సబ్సిడీలు, పన్నులను తీసివేసిన తర్వాత పొందిన సంఖ్య జీవీఏ. ఉత్పత్తి విషయంలో, ఇది జాతీయ ఖాతాలలో బ్యాలెన్సింగ్ అంశంగా కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు