2024లో షావోమీ కొత్త కారు: 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు

శనివారం, 25 డిశెంబరు 2021 (12:42 IST)
Xiaomi
స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన షావోమీ త్వరలోనే కార్ల మార్కెట్లోకి రానుంది. షావోమీ తన మొదటి కారును 2024లో విడుదల చేస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్టు షావోమీ ఈ ఏడాది మొదట్లో ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ప్రకటనను సంస్థ సీఈవో చేశారు.
 
10,000 మందికి పైగా నిపుణులు, ఇంజనీర్లు కార్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టు లీజున్ తెలిపారు. అయినా స్మార్ట్ ఫోన్లు తమ ప్రధాన వ్యాపారంగా ఇక మీదటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్ల ప్రాజెక్టుపై షావోమీ 10 బిలియన్ డాలర్లను (రూ.75,000 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. వార్షికంగా 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని సంస్థ ప్రణాళిక వేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు