భారతీయులకు అమెరికా హెచ్‌ వన్‌బి వీసాల పెంపు

భారతీయ వృత్తి నిపుణులకు హెచ్‌ వన్‌బి వీసాలు పెంచాలనుకుంటున్నామని అమెరికా డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ రాబర్ట్‌ ఓ బ్లాక్‌ తెలిపారు. అకౌంటింగ్‌, సాఫ్ట్‌వేర్‌, ఇంజనీరింగ్‌, న్యాయ రంగాల్లో భారతీయ నిపుణుల పాత్ర కీలకంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ఢిల్లీలో చెప్పారని అసోచెమ్‌ వెల్లడించింది. తమ దేశంలో గట్టి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ భారత్‌కు ఔట్‌సోర్సింగ్‌ను ఆపలేమని కూడా ఆయన పేర్కొన్నారు.

భారత్‌ బిపిఓ రంగానికి రాజధానిగా మారిందని ఆయన కొనియాడారు. ఇరు దేశాల మధ్య పారిశ్రామిక సహకారం భారత్‌లో చిన్న తరహా పరిశ్రమలకు చేయూత నందించగలదని చెప్పారు. ఆర్థిక సహకారానికై త్వరలో భారత్‌కు పలువురు అమెరికా సెనేటర్లు విచ్చేస్తారని వెల్లడించారు. అమెరికా నుంచి భారత దిగుమతులు 2003లో 5బిలియన్‌ డాలర్ల మేర ఉండగా, ఎగుమతులు 13 డాలర్ల మేర ఉందని అస్సోచెమ్‌ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి