సోషల్ వర్కర్‌గా స్థిరపడాలనుకుంటున్నారా?

సమాజంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో మార్గ నిర్దేశనం చేయడమే ఈ సోషల్, వెల్ఫేర్ వర్కర్ బాధ్యత. సమస్యలు భౌతికమైనది కావచ్చు లేక మానసికమైనది కావచ్చు.

వయసు మీద పడటం, నిరుద్యోగం, ఒంటరితనం తదితర సమస్యలు కూడా సామాజిక సమస్యలుగానే పరిగణించబడుతాయి. వీటిని రూపుమాపడమే సోషల్ వర్కర్ల (సమాజ సేవకుల) బాధ్యత.

స్వచ్ఛంద సేవా సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో వీరికి మంచి ఉద్యోగావకాశాలున్నాయి. అనుభవాన్ని బట్టి జీత, భత్యాలు పెరుగుతుంటాయి. దీనికోసం మూడేళ్ల బీఏ(సోషల్ వర్క్), బీఎస్‌డబ్ల్యూ కోర్సులు, రెండేళ్ల ఎంఎస్‌డబ్ల్యూ కోర్సులు చేయవచ్చు.

ఇంటర్ పూర్తి చేసిన వారు బీఏ (సోషల్ వర్క్) , బీఎస్‌డబ్ల్యూకోర్సుల్లోనూ, డిగ్రీ చేసిన వారు ఎంఎస్‌డబ్ల్యూ కోర్సులోనూ ప్రవేశం పొందవచ్చు. దీనికోసం జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండగా, అర్హత మార్కుల ప్రాతిపదికన మరి కొన్ని సంస్థలు విద్యార్థులను తీసుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నప్పటికీ, బీఎస్‌డబ్ల్యూ కోర్సును మనకు అందుబాటులో ఉస్మానియా విశ్వవిద్యాలయం కూటా అందిస్తోంది. ఇతర వివరాలకు ఆ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి