TV, Cinema Artist Association
నూతన సంవత్సర ఆరంభం సాక్షిగా తెలుగు టీవీ, సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ రెండు ముక్కలు కాబోతుందని తెలుస్తోంది. అసోసియేషన్ ఏర్పడి 25 ఏళ్ళు అయింది. ప్రస్తుతం దీనికి వినోదబాల అధ్యక్షుడిగా వున్నారు. విజయ యాదవ్ కార్యదర్శిగా వున్నారు. కాగా, గత కొన్నేళ్ళుగా అసోసియేషన్ లో పరబాషా నటీనటులు సభ్యత్వ విషయంలో పొరపొచ్చాలు వచ్చాయి. కాలమార్పులతోపాటు ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న కొందరు రెండో అసోసియేషన్ గా పెట్టి ముక్కలు చేయాలని చూసినట్లు తెలుస్తోంది. దీనికి పరబాషా నటీమణులు, నటులతో సభ్యత్వంగా తీసుకుని వారిని తనవైపు లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో గాయకుడు, నటుడు అయిన ఓ ప్రముఖ నటుడు తెలుగులోనేకాక, ఇతర భాషల్లోనూ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు.