డీఆర్డీవోలో 290 సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులు

ఆదివారం, 4 ఆగస్టు 2019 (12:03 IST)
భారత రక్షణ శాఖకు చెందిన రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్డీవో)కు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్‌‌మెంట్ సెంటర్ 290 సైంటిస్ట్‌‌లు, ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా డీఆర్డీవో, డీఎస్టీ, ఏడీఏ బెంగళూరు, జీఏఈటీఈసీ, హైదరాబాద్లో ఖాళీలు భర్తీ చేస్తారు.
 
పోస్టులు: సైంటిస్ట్ బి–276, సైంటిస్ట్/ఇంజినీర్ బి–10, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్–4,
అర్హత: పోస్టును బట్టి ఆయా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బ్రాంచ్‌లలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ స్కోర్ ఆధారంగా షార్టిలిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్రకటనతేది: 2019 జూలై 29,
చివరి తేది: ప్రకటన వెలువడిన నాటి నుంచి 21 రోజులలోపు దరఖాస్తు చేయాలి.
వివరాలకు: www.rac.gov.in, www.drdo.gov.in చూడొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు