చార్టర్డ్ ఎక్కౌంటెంట్‌ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీఏఐ పూర్వ అధ్యక్షులు సీఏ ఎం దేవేందర్ రెడ్డి , శక్తివంతమైన అభ్యాస వేదికను సీఏల కోసం ప్రారంభించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తమ విజ్ఞానం పెంచుకోవడంలో సీఏలకు ఇది సహాయపడుతుంది.
ఈ అభ్యాస వేదికను పరిశ్రమ నిపుణులు, ఈ వృత్తిలో అసాధారణ ప్రతిభను చాటుతున్న వ్యక్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా యువ బృందానికి తగిన మద్దతు వ్యవస్థ లభిస్తుందనే వాగ్ధానం లభించినట్లయిందని హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
అసాధారణ నాణ్యత, శ్రేష్టతతో శక్తివంతమైన అభ్యాస వేదికను ప్రారంభించడంతోపాటుగా నిర్వహించాలని హెచ్‌సీఏఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. చార్టర్డ్ ఎక్కౌంటెన్సీ వృత్తి ని వృద్ధి చెందేందుకు తోడ్పడటంతో పాటుగా బహుళ అంశాలలో వృత్తిని విస్తరిస్తూ వాణిజ్య, పరిశ్రమ, వ్యాపార రంగాలకు ప్రభావవంతంగా సేవలను అందించేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా హెచ్‌సీఏఎస్ అధ్యక్షులు సీఏ ప్రబినా కుమార్ మాట్లాడుతూ, అవసరమైన శిక్షణ, సహాయం, మార్గనిర్దేశకత్వం అనేవి అత్యంత కీలకాంశాలు కావడంతో పాటుగా జర్నల్స్, ప్రచురణలు, విద్యా కార్యక్రమాలు, విజ్ఞాన మరియు పరిష్కారాల పోర్టల్ ద్వారా వాటిని చేరుకోగలం. ఆడిటింగ్, ఫెమా, అంతర్జాతీయ ట్యాక్సేషన్, వాల్యుయేషన్ తదితర అంశాలపై కీలకమైన కమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. ప్రొఫెషనల్స్ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.