సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలలో చిన్న పట్టణాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడంలో తోడ్పడిన లీడ్‌

బుధవారం, 3 ఆగస్టు 2022 (23:39 IST)
భారతదేశ వ్యాప్తంగా లీడ్‌ శక్తివంతమైన పాఠశాలలకు గర్వకారణంగా నిలుస్తూ , 2022 బ్యాచ్‌ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు రికార్డులు బద్దలు కొడుతూ  సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలలో అత్యున్నత స్థాయి ప్రతిభ కనబరిచారు. కొవిడ్‌ కారణంగా అభ్యాస నష్టాలు జరగడంతో అతి తక్కువ స్ధాయిలో తమ విద్యను ప్రారంభించినప్పటికీ, విద్యాసంవత్సర ప్రారంభం నుంచి బోర్డు పరీక్షా ఫలితాలు వెల్లడయ్యేనాటికి అత్యుత్తమంగా 23% అధికంగా స్కోర్‌ చేయగలిగారు.


ఇది లీడ్‌ యొక్క అత్యంత కఠినమైన క్లాస్‌ 10 వ్యవస్థ కారణంగానే సాధ్యమైంది. ఇది కాన్సెప్ట్‌ల పట్ల స్పష్టతను అందించడంతో పాటుగా లోతైన అభ్యాసం, సకాలంలో సాధన అవకాశాలను సైతం అందిస్తుంది. అంతేకాదు, 127 మంది లీడ్‌ విద్యార్థులు 90%కు పైగా స్కోర్‌ సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్టెప్పింగ్‌ స్టోన్స్‌స్కూల్‌ విద్యార్థిని ఎం శిరీష అయితే 93.2%స్కోర్‌ చేయగలిగింది.
 
టియర్‌ 2 మరియు ఆపై పట్టణాలలోని పాఠశాలలను సమూలంగా లీడ్‌ మారుస్తోంది. ఈ పట్టణాలలో లభ్యమయ్యే నాణ్యమైన విద్య అంతరాలను ఇది పూరించడంతో పాటుగా భారతీయ మెట్రో మరియు పెద్ద నగరాలకు ధీటుగా తయారుచేస్తోంది. లీడ్‌ ఇప్పటికే 25వేల మందికి పైగా ఉపాధ్యాయులకు తగిన నైపుణ్యం అందించడంతో పాటుగా లోతుగా పరిశోధించిన కరిక్యులమ్‌, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బోధన, సాంకేతిక పరిష్కారాలను బోధన–అభ్యాసం కోసం నేపథ్యీకరించడం ద్వారా అందుబాటు ధరలలోని ప్రైవేట్‌ స్కూల్స్‌లో 1.4మిలియన్ల మందికి పైగా విద్యార్థులకు మెరుగైన ఫలితాలను సాధించడంలో తోడ్పడింది.  లీడ్‌ తో విద్యార్థులు ఆత్మవిశ్వాసం పొందడంతో పాటుగా భావితరపు నైపుణ్యాలైనటువంటి కమ్యూనికేషన్‌, సహకారం, విమర్శనాత్మక ఆలోచన వంటివి నిర్మించుకుని విజయవంతం కాగలుగుతున్నారు.
 
లీడ్‌ కో-ఫౌండర్‌ మరియు సీఈఓ సుమీత్‌ మెహతా మాట్లాడుతూ ‘‘ 2022లో తమ విద్యను ముగించుకుని స్కూల్స్‌ వదిలిన లీడ్‌ సీబీఎస్‌ఈ క్లాస్‌ 10 విద్యార్ధులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను! అభ్యాస వృద్ధి మరియు ఈ విద్యార్థులు సాధించిన అత్యద్భుతమైన ఫలితాలు , లీడ్‌ లాంటి వ్యవస్థలతో  భారతదేశంలోని చిన్న పట్టణాలలోని విద్యార్థులు సైతం విద్యపరంగా మెట్రో నగరాల్లోని విద్యార్థుల్లా మెరుగైన ఫలితాలను సాధించగలరని ధృవీకరిస్తాయి’’ అని అన్నారు.
 
భారతదేశ వ్యాప్తంగా పాఠశాలలకు అత్యాధునిక సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌ను లీడ్‌ అందిస్తుంది. దీనితో  పాటుగా పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలలోని  స్టేట్‌బోర్డ్‌ ప్రోగ్రామ్‌లకు సైతం వినూత్నమైన కరిక్యులమ్‌ అందిస్తుంది. ఈ కరక్యుమ్‌ పూర్తిగా సంబంధిత బోర్డ్స్‌ మార్గదర్శకాలకు లోబడి ఉండటంతో పాటుగా ప్రతి విద్యార్ధి అభ్యాసం సంపూర్ణంగా ఉండటంతో పాటుగా జాతీయ స్థాయిలో ప్రతిభను వెల్లడించే రీతిలో ఉంటుందనే భరోసా అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు