తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది.
ఈ ఫలితాలను polycetts.nic.in, sbtet.telangana.gov.in, www.dtets.cgg.gov.in లో పాలిసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, పాలిసెట్ బైపీసీ విభాగంలో 76.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 92,557 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
ఇదిలావుంటే, ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, పాలిసెట్ ఛైర్మన్ నవీన్‌మిత్తల్ కౌన్సెలింగ్ కాలపట్టికను ఖరారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుంది. నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి.
23న తుది విడత పాలిసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.