ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసుకోవచ్చా.. యూజీసీ గ్రీన్ సిగ్నల్?

శుక్రవారం, 22 మే 2020 (18:45 IST)
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యార్థులకు కొత్తగా ఓ వెసులుబాటు కల్పిస్తుంది. ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ ఈ విషయం తెలిపారు. అయితే, రెండు కోర్సులు రెగ్యూలర్‌గా చేసేందుకు వీలు లేదని.. ఒకటి రెగ్యూలర్‌లో, మరో కోర్సు ఆన్‌లైన్‌లో లేదా డిస్టెన్స్‌లో కానీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. 
 
ఈ ప్రతిపాదన ఏడేళ్ల నుంచి ఉందని.. అయితే.. పలు కారణాల వలన ఇది వాయిదా పడుతూ వస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు యూజీసీ ఆమోద ముద్ర వేసింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. 
 
ఒకే యూనివర్శిటీలో రెండు డిగ్రీలను చేయడం, ఆ రెండింటిలో ఒకటి ఆన్‌లైన్ లేదా డిస్టన్స్‌లో, మరొకటి రెగ్యులర్‌గా చేసే అంశంపై గత ఏడాది యుజిసి వైస్ చైర్మన్ భూషణ్ నేతృత్వంలో చర్చించడం జరిగింది.
 
అయితే ప్రస్తుతం ప్రతిపాదన పట్టాలెక్కింది. 2012 నుంచి నియామకమైన యూజీసీ కమిటీ ఈ అంశంపై చర్చలు జరిపిందని కానీ.. 2020లోనే ఇందుకు ఆమోదముద్ర లభించిందని యూజీసీ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు