టెన్త్ చదివిరా? అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందవచ్చు తెలుసా?

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (10:29 IST)
పదవ తరగతి చదివారా? ఐతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం పొందవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ పోస్టుల్ని కేంద్రం భర్తీ చేస్తోంది. దీని నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. అప్లై చేయాలనుకునే వాళ్ళు 2021 మార్చి 21 లోగా అప్లై చేయాలి. https://ssc.nic.in/ లో వివరాలని తెలుసుకోవచ్చు. రెండు దశల పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది.
 
సిలబస్ ప్రకారం ఈ పేపర్ మొత్తం 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌కు 25 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ మొదటి పేపర్‌ని తొంబై నిముషాల్లో కంప్లీట్ చెయ్యాలి. 
 
పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌, విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్‌మెంట్, డిసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిక్రిమినేటింగ్ మొదలైన వాటిపై ఉంటాయి.
 
అలానే న్యూమరికల్ యాప్టిట్యూడ్‌లో నంబర్ సిస్టమ్స్, కంప్యుటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ లాంటివి కూడా ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్‌కు సంబంధించిన ప్రశ్నలు కూడా దీనిలో ఇవ్వడమా జరుగుతుంది.
 
అంతేకాదు కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనమిక్ సీన్ ప్రశ్నలు కూడా ఇస్తారు. మొదటి పేపర్‌లో కనుక క్వాలిఫై అయితే పేపర్ 2 పరీక్ష రాయాలి. షార్ట్ ఎస్సే, లెటర్ వంటివి రాయాల్సి ఉంటుంది. షార్ట్ ఎస్సేకు 50 మార్కులుంటాయి. 30 నిమిషాల్లో పేపర్-2 కంప్లీట్ చెయ్యాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు