తెలంగాణా ఈసెట్ ఫలితాలు విడుదల : 95.16 శాతం మంది అర్హత

బుధవారం, 18 ఆగస్టు 2021 (11:48 IST)
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించి ఈసెట్‌-2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 11 సమయంలో వెల్లడించారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. 
 
పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 95.16 శాతం మిద్యార్థులు అర్హత సాధించారు. ఆగస్టు 3న జరిగిన ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
కాగా, ఈ నెల 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. ఆగస్టు 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు. 
 
సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చేనెల 13వ తేదీ నుంచి ఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 18న స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు