మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

ఠాగూర్

సోమవారం, 6 జనవరి 2025 (10:04 IST)
రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభ స్టేషన్‌లను మార్చి నెల నుంచి నూతన టెర్మినల్ చర్లపల్లికి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నిర్ణయం మార్చి నుంచి అమల్లోకి రానుంది. అలాగే మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ ఇస్తున్నట్లు పేర్కొంది. చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ - చెన్నై సెంట్రల్ టెర్మినల్‌ను హైదరాబాద్ (నాంపల్లి) నుంచి చర్లపల్లికి మార్చింది. ఈ నిర్ణయం మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అలాగే గోరఖ‌పూర్ - సికింద్రాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్ టెర్మినల్‌ను సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చింది. ఈ నిర్ణయం మార్చి 12 నుంచి అమల్లోకి వస్తుంది. 
 
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్లకు చర్లపల్లి టెర్మినల్ స్టాపేజీ ఇస్తున్నట్లు ద.మ. రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ తెలిపారు. ఈ నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ (12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ బయల్దేరుతుంది. 8.32కి చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12757) చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకుంటుంది.
 
గుటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201) చర్లపల్లిలో మధ్యాహ్నం 12.41కి, సికింద్రాబాద్- గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202) మధ్యాహ్నం 12.50కి చర్లపల్లిలో ఆగుతాయి. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (17233) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 3.47కి, సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234) ఉదయం 9.20కి చర్లపల్లిలో ఆగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు