పిల్లలకు ఎన్నిసార్లు ఆహారం పెట్టాలి?

బుధవారం, 11 సెప్టెంబరు 2013 (17:19 IST)
FILE
నాలుగేళ్లు వచ్చాయంటే పిల్లల్ని బడిలో చేర్చేస్తారు తల్లిదండ్రులు. అప్పటితో చదువుల వేట మొదలైపోతుంది. వారు పెట్టిన వెంటనే తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి మీరే ఓపికగా పెట్టాలి. పిల్లలు తినడానికి మారాం చేస్తుంటే మా పిల్లలు తినరు అని చెప్పి వదిలేయకండి. భయపెట్టో, బుజ్జగించో వారికి తినిపించాలి.

పిల్లలు పెద్దవాళ్లలాగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో భోజనం చేయలేరు. ఆ భోజనంతోనే ఒక పూటంతా ఉండలేరు. కనుక వారికి రోజుకో ఐదు నుంచి ఆరు సార్లు కొంచెం కొంచెంగా అన్నం తినిపించాలి. ఎప్పుడు ఆకలి అన్నా, ఏదో ఒకటి పెడుతూ ఉండండి. తినే ఆసక్తి చూపించకపోతే ఆహారాన్ని రకరకాల ఆకారాలలోకి మార్చి, ఊదాహరణకు ఇడ్లీని త్రిభుజం ఆకారంలో చేసి చూశావా ఇది పర్వతం ఉంది కదా... అని నోట్లో పెట్టేస్తూ ఉండండి.

వెబ్దునియా పై చదవండి