పిల్లలకు చైనా ఆటవస్తువులివ్వకండి ...!

అతి తక్కువ ధరలో లభ్యమయ్యే వస్తువులు చైనా ఆటవస్తువులు. వీటివైపు ప్రతిఒక్కరు చూపు మరల్చుకోలేంతగా ఈ ఆట వస్తువులుంటాయి. నేటి పిల్లలుకూడా ఎక్కువగా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు జోరందుకున్నాయి.

చిన్న పిల్లలను నవ్వించడానికి, వారిని ఆడించడానికికూడా చైనా ఆటవస్తువులను వెంటనే తల్లిదండ్రులు ఇచ్చేస్తుంటారు. ఏమీ తెలియని అమాయకులు వీటిని తమ నోట్లో పెట్టుకుని నములుతూ ఆడుకుంటుంటారు. ఈ ఆటబొమ్మల వలన ఏదైనా ఆపద సంభవించినప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు.

ఒకవేళ మీరుకూడా మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంటే ఎట్టిపరిస్థితులలోనూ చైనా ఆట బొమ్మలను వారికి ఇవ్వకండి. ఒకవేళ వారికి ఇలాంటి బొమ్మలు ఇచ్చి ఉంటే వెంటనే వాటిని తీసుకుని ధ్వంసం చేయండి.

చైనా ఆటబొమ్మల వలన దుష్ప్రభావం

** చైనా ఆట వస్తువులను తయారుచేయడానికి లెడ్, క్రోమియమ్, కైడమియమ్ లాంటి విషపూరితమైన రసాయనాలు ఉపయోగిస్తారు. దీంతో రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

** లెడ్ పిల్లల మస్తిష్కంలోని నరాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వీటివలన పిల్లలు తమ చదువులో వెనుకబడుతారు.

** కైడియమ్ పిల్లల కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్యులు.

** ఇలాంటి ఆట వస్తువులు తరచూ వాడుతుంటే భవిష్యత్తులో కడుపునొప్పి, క్యాన్సర్, రక్తపోటు, తలపోటులాంటి జబ్బులు పెరిగే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

** చైనా ఆట బొమ్మలకు రంగులు వాడేటప్పుడు అందులో లెడ్‌ను ప్రయోగిస్తారని దీంతో రక్తపోటు సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి