పిల్లల ఆహారంలో శ్రద్ధ తీసుకోండి..!

చంటి పిల్లలు ఆహారం తీసుకోవడానికి ఉత్సుకత చూపిస్తుంటారు. కాని వారికి ఏవంటే అవి ఆహారంగా ఇవ్వకూడదు. ఆకర్షణీయమైన రంగులున్న ఆహార పదార్థాలను మరీ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

అలాంటి వాటిని కొని ఇవ్వకుండా శరీరానికి కావలసిన పోషక విలువలు కలిగిన ఆహారాన్నే వారికి ఇవ్వాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వారికి ప్రారంభంలోనే తాజా పండ్లు, తాజా కూరగాయలు, చేపలు, పప్పుదినుసులు మొదలైనవి చక్కెర లేకుండా తినిపించండి. పిల్లలు ఆరోగ్యంతోబాటు అందంగా, చలాకీగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి