పిల్లలకు చేపలు తినిపిస్తే తెలివి పెరుగుతుంది

పిల్లలకు ఆహారంగా చేపలను ఇస్తే వారిలో బుద్ధిబలం పెరుగుతుందని వైద్యులు తెలిపారు. వారానికి ఒకసారి చేపలు తిన్న 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో తెలివి బాగా పెరిగినట్లు పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. దీంతోబాటు వారి శరీరంలో కొవ్వు శాతంకూడా తగ్గినట్లు, ఇతర శరీర భాగాలుకూడా సక్రమంగా ఎదిగినట్లు పరిశోధనలో వెల్లడైనట్లు వారు వివరించారు.

చేపలు తిన్న వారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉన్నట్లు, అదికూడా వారిలో ఓపిక, సహనంకూడా ఎక్కువ శాతం ఉందని పరిశోధకులు తెలిపారు. కాగా ఇతరులకన్నాకూడా చేపలు తిన్నవారిలో ఉత్సాహంపాళ్ళు 11శాతం పెరిగిందని ప్రొఫెసర్ క్జెల్ టోరెన్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి