పిల్లలకోసం ఇలా అలంకరించి సర్వ్ చేయండి..!

FILE
* జావ చేస్తున్నట్లయితే.. దానిపై పండ్లముక్కలు, ఎండుద్రాక్ష ఎక్కువ మోతాదులో వేయండి. కోడిగుడ్ల టోస్ట్‌, పండ్లతో చేసిన మిల్క్‌షేక్‌లయితే మరీ మంచిది. పీనట్‌బటర్‌ లేదా వేయించిన వేరు శెనగపప్పు శరీరానికి మంచి శక్తినందిస్తుంది. పెరుగు, లేదా పాలు, అన్నంతో కలిపి తయారుచేసే ఫుడ్డింగ్‌లు మేలు చేస్తాయి.

* నట్స్‌ను మించిన స్నాక్‌లేదు. వీటిలోని అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్సే అందుకు కారణం. అలాంటి రకాల్లో బాదం, పిస్తా, వేరుశెనగ, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఫ్రూట్‌ లెదర్స్‌, డ్రై బనానా శరీర బరువును పెంచుతాయి. పసిపిల్లలకే కాదు, పెద్దవారికీ అరటిపండు లేదా అరటిపండు స్ట్రాబెర్రీలు కలిపిన స్నాక్‌ పోషకాలతో పాటు కెలొరీలనూ అందిస్తుంది.

* కెలొరీలు ఎక్కువగా అందించే పచ్చి బఠాణీ, మొక్కజొన్న, బంగాళాదుంప, చిలగడదుంప, కందలను పిల్లలకు ఎక్కువగా ఇవ్వటం మంచిది. వైట్‌ బ్రెడ్‌ను ఎంచుకోవడం మంచిది. పీచు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి పొట్ట నిండిన భావన కలగదు. దాంతో రెండో స్లైసు తినడానికి ప్రాధాన్యమిస్తారు. భోజనం తర్వాత పాలతో చేసిన ఫుడ్డింగ్‌ లేదా పండ్లతో చేసిన కస్టర్డ్‌, అరటిపండుతో చేసే ఇన్‌స్టంట్‌ ఫుడ్డింగ్‌ పెట్టడం తప్పనిసరి.

* బ్రెడ్‌స్లైసును వెన్నతో టోస్ట్‌లా చేసి అందివ్వండి. టాపింగ్‌గా పీనట్‌బటర్‌, చీజ్‌, మయోనైజ్‌, కోడిగుడ్డుతో చేసిన పదార్థాలు పొద్దుటి పూట అల్పాహారంగా అందిస్తే మాంసకృత్తులతో పాటు, శక్తీ లభిస్తుంది. ఉడికించిన బంగాళాదుంపను నేరుగా కాకుండా, ముద్దలా చేసి పాలు, చీజ్‌ కలిపి పెట్టాలి. ఆవిరిపై ఉడికించిన కూరగాయలకు చీజ్‌సాస్‌ను టాపింగ్‌లా వేసి అందించినా శక్తితోపాటు మాంసకృత్తులు, క్యాల్షియం అందుతాయి.

వెబ్దునియా పై చదవండి