పిల్లలు తమ బొటన వేలిని నోట్లో పెట్టుకోవడం సర్వ సాధారణం, కాని ఆరు నెలల తర్వాతకూడా పిల్లవాడు తన వేలిని నోట్లో పెట్టుకుంటుంటే తల్లిదండ్రులు వారిని ఏమాత్రం పట్టించుకోవట్లేదనేది దాని సారాంశం.
పిల్లవాడు తమను తాము ఒంటరిగా భావించే సందర్భంలోనే వారు అలా చేస్తారని వైద్య నిపుణులు తెలిపారు. అందునా వారిలో అభద్రతా భావం ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఇలా చేస్తారని వారు వివరించారు. కాని తల్లిదండ్రులు దీనిని చాలా సర్వ సాధారణంగా భావిస్తారు. ఇలా చేస్తే పిల్లవానికి ఎంత నష్టం అనేది మీకు తెలుసా?
బొటన వేలు నోట్లో పెట్టుకోవడం వలన కలిగే నష్టాలు :-
** ప్రతి సారీ పిల్లవాడ్ని శుభ్రంగా ఉంచలేరు. అయినాకూడా పిల్లలు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుంటుంటారు. కాని చేతుల్లో మురికితోబాటు దుమ్ము, క్రిమి-కీటకాలు పిల్లవాని చేతి ద్వారా నోట్లోకి చేరుకుంటాయి.
** సాధారణంగా పిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకుంటే వారికి ఆకలికూడా అంతగా ఉండదు. వారు పాలు కాని భోజనం కాని అడగరు. దీంతో వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు.
** నోట్లో వేలు పెట్టుకోవడం వలన అతని మస్తిష్కంపైకూడా తీవ్రమైన ప్రభావం పుడతుంది. వారు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటే వారు బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉంది అంటున్నారు ప్రముఖ వైద్యులు.
** పిల్లలు తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడంవలన వారి దంతాలు బయటికి చొచ్చుకు వస్తాయి. వారి పెదాలు లావుగా మారడానికి అవకాశం ఉంది. అలాగే నోరు తెరిచి ఉంచే అలవాటుకూడా వారి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు.
** కేవలం ఒక బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించడం మూలాన వారి వేలు సన్నగా మారుతుంది. దీని ప్రభావం వారి చదువుపైకూడా పడుతుంది.
** తమ బొటన వేలు నోట్లో పెట్టుకుని చప్పరించే పిల్లల నాలుక బయటికి చొచ్చుకు వస్తుంది. దీంతో వారి మాటల్లో స్పష్టత ఉండదు.
** ఇలాంటి పిల్లలు బలహీనంగా, అలసత్వంతో కూడుకున్న వారిగా తయారవుతారంటున్నారు వైద్యులు.