మీ చిన్నారులు గొంతునొప్పితో బాధపడుతున్నారా..?

FILE
* పిల్లల్లో గొంతునొప్పి రావడానికి.. కలుషితమైన నీరు, ఆహారం, ఎదుటివారి నోటి తుంపరలు, వాటితో పాటు కిక్కిరిసిన జనవాసాలు, ఇరుకు ఇళ్లు, పాఠశాలలు, అపరిశుభ్ర వాతావరణం.. లాంటివన్నీ కారణమవుతాయి. గొంతునొప్పి బారిన పడకుండా ఉండాలంటే.. పిల్లలకు నోటి శుభ్రత నేర్పాలి. కిక్కిరిసిన గదుల్లో లేకుండా చూడాలి. ముఖ్యంగా ఒకే గదిలో ఎక్కువమంది లేకుండా చూడటం మంచిది.

* గొంతు ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన పిల్లలను స్కూలుకి పంపక పోవటం ఉత్తమం. రోగ నిరోధకశక్తి పెరిగేందుకు పిల్లలకు మంచి పోషకాహారం పెట్టాలి. పిల్లలకు గొంతు ఇన్‌ఫెక్షన్‌ వచ్చినపుడు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి కోర్సు యాంటీబయాటిక్స్‌ మందులను వాడాలి. పిల్లలు జలుబు, దగ్గు, టాన్సిల్స్‌ వాపుతో ఇబ్బందిపడుతుంటే, వైద్యుని పర్యవేక్షణలో యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వటం మంచిది.

* ఒకసారి గొంతునొప్పి వచ్చి తగ్గాక.. 2-3 వారాల తర్వాత కీళ్లనొప్పులు, కీళ్లవాపు, జ్వరం, ఒంటి మీద దద్దుర్ల వంటివి వచ్చినట్లయితే.. ‘రుమాటిక్‌ జ్వరమని’ అనుమానించి ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుండా తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా రుమాటిక్‌ జ్వరం పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. చిన్నవయసులో దీని బారినపడితే కవాటాలు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పిల్లల్ని దాని బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వెబ్దునియా పై చదవండి