మీ పిల్లలకు స్నేహితులున్నారా...?

WD
ఒంటరితనం పిల్లలకు మంచిది కాదంటున్నారు పరిశోధకులు. అయితే కొంతమంది స్నేహితుల వల్ల చెడిపోయినవారు లేకపోలేదు. కానీ స్నేహితుల వల్ల నష్టాలకంటే లాభాలే ఎక్కువ. స్నేహితులున్న వారి శరీరానికి తెలియకుండానే వ్యాయామం వస్తుంది.

స్నేహితులకోసం నడుస్తారు. టీనేజ్‌లో అయితే స్నేహితులకోసం పరుగెత్తడం, ఆటలు ఆడటం వంటివి చేస్తారు. స్నేహితులతో సాయంకాలం ఆటలాడేవారు హాయిగా నిద్రపోగలుగుతారు. రోజూ కలుసుకోలేక పోతే కనీసం ఫోన్లో అయినా కబుర్లు చెప్పుకోవడం మంచిది.

అలాకాక ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవారికి రక్తపోటులో మార్పులొచ్చే అవకాశం ఎక్కువ. ఒంటరితనం బాధ పోగొట్టుకునేందుకు పిల్లలు కనిపించిన పదార్థాలన్నిటినీ తింటూ ఉంటారు. దీనివలన శరీర రూపం మారుతుంది. భారీకాయులలో చాలామంది స్నేహితులు లేనివారేనని పరిశోధకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి