మెదడు ఎన్ని విషయాలనైనా గుర్తు పెట్టుకోగలదా..?

FILE
* మెదడు కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్ లాంటిదే. ఎందుకంటే.. హార్డ్ డిస్క్‌లో ఎంత సమాచారాన్నయినా ఎంచక్కా దాచుకోవచ్చు. అలాగే మెదడులోకూడా. ఫలానా విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకోకపోతే, అది పరిశీలనకు అందటంగానీ, గుర్తుండటంగానీ కష్టం. కాబట్టి ఆసక్తిగా గుర్తుంచుకునేలా చదవటం చాలా ముఖ్యమైన విషయం.

* సాధనవల్లనే ఏ అలవాటయినా ఖచ్చితంగా అలవడుతుంది. ఏ పని అయితే చేస్తున్నారో దానిపైనే దృష్టి కేంద్రీకరించటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు చదువు విషయంలో కూడా అది తేలిక అవుతుంది. సాధారణంగా మెదడుకు ప్రశ్నలు వెళితే దానికి సమాధానం తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది.

* చదువుకుంటున్నప్పుడు ఆ దారిలో ఏదైనా శబ్దం వినిపిస్తే.. అది ఏ పెళ్లిదో, దేవుడి ఊరేగింపుదో, అసలు ఏంటో.. అనే ప్రశ్నలు తెలియకుండానే మెదడుకు చేరుతాయి. దాంతో అది దానికి సమాధానాలు తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. అలాంటప్పుడు ఆటోమేటిగ్గా ఏకాగ్రత చెదిరిపోతుంది. అందుకే చదువుకునేటప్పుడు చుట్టుప్రక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి.

* ఏకాగ్రత చెదిరిపోకుండా ఉండాలంటే.. మెదడును ఎప్పటికప్పుడు చదువు, ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలతో నింపేయాల్సిందే. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని మెదడుకు సంకేతాలు అందిస్తే.. అది దాన్ని చేరుకునేందుకు శాయశక్తులా సిద్ధం చేస్తుంది. అందుకనే పిల్లలూ.. ఒక నిర్దిష్ట లక్ష్యం లేకుండా చదవవద్దు.

వెబ్దునియా పై చదవండి