* రాసేటప్పుడు వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అక్షరాలపై చేతినీడ పడకుండా జాగ్రత్త పడాలి. కుడిచేతి వాటంవాళ్లయితే ఎడమచేతి వైపునుంచి, ఎడంచేతి వాటం వాళ్లయితే కుడివైపు నుంచి వెలుతురు పడేలా చూసుకోవాలి. కుర్చీ, టేబుల్ ఎత్తుకి సరిపోయేటట్లుగా ఉండాలి. రాసేటప్పుడు టేబుల్ మరీ ఎత్తుగా ఉంటే భుజాలకు అసౌకర్యంగా ఉండి, నొప్పితో ఎక్కువసేపు రాయలేరు.
* పేపర్ పెట్టే బల్ల చదునుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. టేబుల్ మరీ స్మూత్‌గా ఉంటే రాసేటప్పుడు పెన్ను జారిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల చేతి వ్రాత కూడా దెబ్బతింటుంది. కాబట్టి రాసేందుకు కూర్చున్నప్పుడు చేతులు కదల్చటానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. ఎడమచేతివాటం కలవారు కొద్దిగా కుడివైపుకు, కుడిచేతి వాటం గలవారు ఎడమవైపునకు పేపర్ ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి.