కావలసిన పదార్థాలు : చికెన్... పావు కేజీ నూడుల్స్... రెండు ప్యాకెట్లు ఉల్లికాడలు... ఒక కట్ట క్యాప్సికం... ఒకటి ఉప్పు... తగినంత మిరియాలపొడి... ఒక టీ. అజినమోటో... అర టీ. మొలకెత్తిన పెసలు... అర కప్పు సోయాసాస్... రెండు టీ. నూనె... రెండు గరిటెలు
తయారీ విధానం : చికెన్ ముక్కలను ఉడికించాలి. నూడుల్స్‌ను ఉడికించి, నీటిని వార్చేసి కొద్దిగా నూనె కలిపి ప్రక్కన ఉంచాలి. ఉల్లికాడలను తరిగి, క్యాప్సికంను పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి. పాన్‌లో నూనె వేడిచేసి.. క్యాప్సికం, ఉల్లికాడలు, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో, వేగి కాసేపు వేయించాలి.
తరువాత అందులోనే మొలకెత్తిన పెసలు, చికెన్ ముక్కలను వేసి బాగా వేయించాలి. చివరగా ఉడికించిన నూడుల్స్, సోయాసాస్ వేసి బాగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ నూడుల్స్ రెడీ అయినట్లే...!