పనీర్ పాస్తా తయారీ విధానం..

బుధవారం, 13 ఫిబ్రవరి 2013 (17:46 IST)
FILE
పనీర్ పాస్తాలంటే పిల్లలు పడిచస్తారు. పిజ్జా షాపుల్లో వీటిని కొనిపెట్టేకంటే మీ ఇంట్లోనే హైజినిక్‌గా ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. పనీర్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దామా?

కావల్సినవి :
ఉల్లిపాయలు - ఐదు
టమాటాలు - నాలుగు
పాస్తా - రెండొందల గ్రాములు
క్యాప్సికం - ఒకటి
నూనె - రెండు చెంచాలు
కారం - చెంచా
ఉప్పు - రుచికి తగినంత
టమాటా కెచప్ - కొద్దిగా

తయారీ : ముందుగా పాస్తాలో ఉప్పు వేసి మూడు కూతలు వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికం తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణిలోని నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేయాలి. అవి మగ్గాక ఉడికించిన పాస్తా చేర్చాలి. పావుగంటయ్యాక క్యాప్సికం, టమాటాలు చేర్చాలి.

కొద్దిసేపయ్యాక పనీర్ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలియతిప్పాలి. నాలుగైదు నిమిషాలయ్యాక టమాటా కెచప్ వేసి దించేస్తే సరిపోతుంది. దీన్ని గార్లిక్ బ్రెడ్‌తో తింటే రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి