కావలసిన పదార్థాలు : నూడుల్స్... 400 గ్రా. క్యారెట్లు... 400 గ్రా. బీన్స్... వంద గ్రా. టొమోటో సాస్... ఒక కప్పు అల్లం... నాలుగు అంగుళాలు వెల్లుల్లి... ఒక పాయ రెడ్ చిల్లీ సాస్... నాలుగు టీ. నూనె... అర కప్పు క్యాబేజీ... 200 గ్రా. కార్న్‌ఫ్లోర్... వంద గ్రా. ఉప్పు... రెండు టీ. రెడ్ ఆరెంజ్ కలర్... అర టీ.
తయారీ విధానం : రెండు కప్పుల మరిగించిన నీటిలో నూడుల్స్‌ను వేసి, ఉడికిన తరువాత నీటిని వంపేసి ఆరబెట్టాలి. ఓ ప్రెషర్‌పాన్‌లో నూనె పోసి కాగాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలను వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ముక్కలను వేసి మూడు నిమిషాలపాటు వేయించాలి. తరువాత నూడుల్స్ కూడా కలిపి వేయించాలి.
ఇప్పుడు రెడ్ చిల్లీసాస్, టొమోటో సాస్‌లను కూడా పాన్‌లో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు కాసిన్ని నీళ్లను పోసి ఉడికించాలి. కాసిన్ని నీళ్లలో కార్న్‌ఫ్లోర్ కలిపి ఉడుకుతున్న నూడుల్స్ మీద పోస్తే చిక్కదనం వస్తుంది. చివర్ల్ ఉప్పు సరిజూసి, అజినమోటో చల్లి, రెడ్ ఆరెంజ్ కలర్ కూడా వేసి కలిపి దించేయాలి. అంతే సూజువాన్ చౌమీన్ రెడీ అయినట్లే...!