కావలసిన పదార్థాలు : సిమ్లా ఆపిల్ ముక్కలు... నాలుగు కప్పులు పంచదార... మూడు కప్పులు గోరువెచ్చటి నీరు... నాలుగు కప్పులు సన్నటి అరటిపండు ముక్కలు.. ఒక కప్పు గింజల్లేని ఖర్జూరాలు... ఒక కప్పు ఎండుద్రాక్ష... అర కప్పు తేనె... అర కప్పు వెనీలా ఎసెన్స్... రెండు టీ. నిమ్మరసం... రెండు టీ. ఉప్పు... చిటికెడు
తయారీ విధానం : పంచదారను లేత పాకం పట్టి ఉంచాలి. యాపిల్‌ముక్కలు, అరటిపండు ముక్కలు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తేనె, వెనీలా ఎసెన్స్, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలపాలి. తరువాత అందులోనే పంచదార పాకం, గోరువెచ్చని నీళ్లు కూడా పోసి కలపాలి. దీన్ని అందమైన గాజు లేదా పింగాణీ పాత్రలో పోసి ఫ్రీజర్‌లో గంటసేపు ఉంచి చిన్నచిన్న బౌల్స్‌లో సర్ది అతిథులకు సర్వ్ చేయాలి. అంతే ఆపిల్ క్రాష్ రెడీ...!!