సూపర్బ్ టేస్టీ అండ్ హెల్దీ.. "మేథీ పఫ్‌"

FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కప్పు
మెంతిపొడి... రెండు టీ.
ఉప్పు... ఒక టీ.
నూనె... సరిపడా
వాము.. అర టీ.
ఛాట్ మసాలా... తగినంత

తయారీ విధానం :
మైదా పిండిలో మెంతి పొడి, వాము, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని పలచగా వత్తుకోవాలి. కావలసిన షేపులో కట్‌ చేసుకుని నూనెలో సన్నటి సెగ మీద కరకరలాడేవరకు వేయించి తీయాలి. చల్లారిన తర్వాత ఛాట్‌మసాలా చల్లి వడ్డించాలి. క్రిస్పీగా, టేస్టీగా ఉండే మేథీ పఫ్ కొన్ని రోజులదాకా నిల్వ ఉంటాయి కూడా...!!

వెబ్దునియా పై చదవండి