కావలసిన పదార్థాలు : చికెన్.. అర కేజీ ఉల్లి తరుగు... అర కప్పు పుట్టగొడుగులు... ఒక కప్పు బేబీకార్న్... 4 లెమన్ గ్రాస్ తరుగు... ఒక టీ. అల్లం.. చిన్న ముక్క గుమ్మడికాయ తరుగు.. ఒక కప్పు గ్రీన్‌కర్రీ పేస్ట్... ఒక టీ. నూనె.. అర టీ. బేసెల్ ఆకులు... రెండు ఉప్పు.. తగినంత కొబ్బరిపాలు.. ఒక కప్పు నీరు.. ఒక కప్పు
తయారీ విధానం : నూనె వేడిచేసి గ్రీన్ కర్రీ పేస్ట్‌ని కలపాలి. అందులో నీళ్లుపోసి మరిగాక కొబ్బరి పాలను కలపాలి. తరువాత పైన చెప్పుకున్న పదార్థాలన్నింటితోపాటు చికెన్ ముక్కలను కూడా కలిపి పదిహేను నిమిషాలపాటు ఉడికించి దించేయాలి. అంతే థాయ్ చికెన్ గ్రీన్ కర్రీ రెడీగా ఉన్నట్లే..! దీన్ని వేడి వేడి రైస్‌తోనూ, పుల్కాలు, రోటీలతోనూ కలిపి తింటే సూపర్బ్‌గా ఉంటుంది.