ఆలూ కటోరి ఫ్రూట్ ఛాట్

FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... అర కేజీ
ఉప్పు... సరిపడా
నూనె... తగినంత
ఆపిల్స్... మూడు
ఫైనాఫిల్... ఒకటి
పాలమీగడ... 120 మి.లీ.
ఛాట్ మసాలా... అర టీ.
మిరియాల పొడి... అర టీ.
నిమ్మరసం... సగం
దానిమ్మ గింజలు... అర కప్పు

తయారీ విధానం :
బంగాళాదుంపలను పొడవుగా, సన్నగా తరగాలి. వేడినీటిలో ఉప్పు వేసి, అందులో ఈ ముక్కల్ని వేసి రెండుసార్లు కడగాలి. తరువాత పొడిబట్టతో తుడిచేయాలి. ఇప్పుడు టీ ఫిల్టర్లను తీసుకుని... ఒకదానిలో గుప్పెడు బంగాళాదుంప ముక్కల్ని వేసి, మరోదానితో ఆ ముక్కల్ని వత్తుతూ నూనెలో వేయించాలి. ఇలా చేస్తే బంగాళాదుంప ముక్కలు కప్పులాగా తయారవుతాయి. ఇదే కటోరి.

ఇప్పుడు ఫైనాఫిల్‌ను ముక్కలుగా కోసి, పది నిమిషాలు వేడినీటిలో ఉడికించి తీయాలి. ఆపిల్స్‌ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత ఫైనాఫిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులో కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి, మీగడ, నిమ్మరసం, ఛాట్ మసాలా చేర్చి ఆలూ కటోరీలలో నింపి పైన దానిమ్మగింజలు చల్లి చల్లగా సర్వ్ చేయాలి. అంతే ఆలూ కటోరి ఫ్రూట్ ఛాట్ తయార్...!!

వెబ్దునియా పై చదవండి