నోరూరించే "బీట్‌ రూట్‌ బాల్స్‌"

FILE
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్ తురుము... అర కిలో
పంచదార పొడి... పావు కిలో
కలాఖండ్... వంద గ్రా.
నెయ్యి... 75 గ్రా.
ఎండుకొబ్బరి పొడి... 75 గ్రా.
జీడిపప్పు... 25 గ్రా.
జీడిపప్పు పొడి.. 25 గ్రా.
ఎండుద్రాక్ష... 15 గ్రా.
యాలకుల పొడి... అర టీ.
పచ్చకర్పూరం పొడి... కొద్దిగా
ఉప్పు... చిటికెడు

తయారీ విధానం :
ఎండుకొబ్బరి తురుము, జీడిపప్పు దోరగా వేయించి ఉంచాలి. బీట్‌రూట్‌ తురుములో కొద్దిగా నెయ్యివేసి తురుములోని తేమ పోయే వరకూ సన్నని సెగమీద వేయించాలి. అందులో పంచదార, పొడిపొడిగా చిదిమిన కలాఖండ్‌ వేసి అట్లకాడతో పాకం వచ్చేవరకూ కలుపుతూనే ఉండాలి.

ఈ మిశ్రమం ముద్దగా తయారవుతుండగా కొబ్బరిపొడి, ఉప్పు, జీడిపప్పుపొడి, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి, ఎండుద్రాక్ష, నెయ్యి.. అన్నీ వేసి బాగా కలిపి దించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే కావలసిన సైజులో ఉండలు చుట్టి ట్రేలో ఆరబెట్టాలి. సుమారు ఐదారు గంటల తరువాత తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి