బాదం పిస్తా నౌరతన్

FILE
కావలసిన పదార్థాలు :
పిస్తా... అర కప్పు
జీడిపప్పులు... అర కప్పు
పంచదార... ఒక కప్పు
కుంకుమపువ్వు... 4 రేకలు
పాలు... పావు కప్పు

తయారీ విధానం :
కాజు, పిస్తాను రెండు గంటలపాటు నానబెట్టి విడవిడిగా పాలతో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో సగం పంచదారను నీళ్లు కలపకుండా మధ్యస్థంగా పాకంపట్టి సగం కాజు మిశ్రమం, సగం నెయ్యి కలిపి గట్టిపడేదాకా ఉడికించి, ఆ తరువాత స్టౌ మీది నుంచి దించేయాలి. ఇందులో సగం కుంకుమపువ్వు కలిపి రంగు మారేంతదాకా కలపాలి. అలాగే మిగిలిన పంచదారను పిస్తా మిశ్రమంలో వేసి, మిగిలిన నెయ్యిని కలిపి ఉడికించి, స్టౌమీది నుంచి దించి మిగిలిన సగం కుంకుమపువ్వు వేసి రంగు మారేదాకా కలపాలి.

ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని కాజూ మిశ్రమంలో చిన్న ఉండ తీసుకుని పొడవుగా రోల్ చేయాలి. ఇదే విధంగా పిస్తా మిశ్రమాన్ని కూడా రోల్స్ చేయాలి. ఇలా తయారు చేసిన కాజూ, పిస్తా రోల్స్‌ను సమానంగా చదరంగా సర్ది చాకుతో కట్ చేయాలి. అంతే బాదంపిస్తా నౌరతన్ తయార్...! అయితే కట్ చేసిన నౌరతన్‌ విడిపోకుండా వత్తి, గార్నిషింగ్ కోసం సిల్వర్ పేపర్‌ను చుడితే సరి..!!

వెబ్దునియా పై చదవండి