కావలసిన పదార్థాలు : మెకరొని... ఒక కప్పు ఉల్లిపాయలు... మూడు నూనె... 3 టీ. టొమోటో గుజ్జు... అర కప్పు కారం... ఒక టీ. పసుపు... పావు టీ. అల్లంవెల్లుల్లి ముద్ద... అర టీ. జీడిపప్పు... పది గసాలు... రెండు టీ. పెరుగు... అర కప్పు కసూరి మెంతిపొడి... అర టీ. ఉప్పు... తగినంత గరంమసాలా... అర టీ.
తయారీ విధానం : మెకరొనిని వేడినీటిలో వేసి ఉడికించి నీటిని వంపేయాలి. అందులో కొద్దిగా నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉల్లిపాయను తరిగి ముద్దలా చేయాలి. గసాలు, జీడిపప్పులను కూడా ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో ఉల్లిముద్దను వేసి బాగా వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేయాలి.
టొమోటో గుజ్జును కొద్దిగా వేస్తూ వేయించాలి. ఆపై పెరుగు, జీడిపప్పు ముద్దను వేసి బాగా ఉడికించాలి. అవసరమైతే కాసిన్ని నీళ్ళు కూడా పోసి ఉడికించాలి. తరువాత అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న మెకరొనీని వేసి ఐదు నిమిషాలపాటు వేయించి చివర్లో మెంతిపొడి, గరంమసాలా పొడి చల్లి కలిపి దించేయాలి. దీన్ని వేడి వేడి చపాతీలతో కలిపి తింటే సూపర్బ్‌గా ఉంటుంది.